పాతబస్తీలో వీధి పోరాటాలు
స్ట్రీట్ ఫైట్ పేరుతో హత్య
స్ట్రీట్ ఫైట్...అవును కొద్ది రోజులనుంచి
హైదరాబాద్ పాత బస్తీలో స్ట్రీట్ ఫైటింగ్ ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.. వీధుల్లో జన
సంచారం తగ్గగానే ఒక గుంపు ప్రత్యక్షమై కొట్టుకోవటం ప్రారంభిస్తుంది. సినిమాల్లో
జరిగే పోరాట దృశ్యాలను తలపిస్తూ ఒకరిపై ఒకరు ముష్టి ఘాతాలను కురిపిస్తూ
చితకబాదుకుంటారు. నిజానికి వీరి మధ్య శతృత్వం ఉండదు. అయినా కసి తీరా
కొట్టుకుంటారు. రక్తం ఓడుతున్నా పట్టించుకోరు. వారి లక్ష్యం గెలుపే. ఆశ్చర్యం
ఏమిటంటే వీరికి ఒక రెఫరీ కూడా ఉంటాడు. చుట్టూరా మూగిన జనం ఈ పోరాటాన్ని సినిమా
చూసినట్టే చూస్తారు తప్ప వారించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్యాషన్.
ప్రాణం తీసిన స్ట్రీట్ ఫైట్...
పాతబస్తీలో విస్తరించిన ఈ వికృతక్రీడ ఒక
నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పంజేశా ప్రాంతంలో తెల్లవారు జామున జరిగిన స్ట్రీట్
ఫైటింగ్ లో నబీల్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇదంతా సినిమా
ఫక్కీలో జరగటం విశేషం.
వారంతా
స్నేహితులే. ఇందులో అవేజ్ అనే యువకుడు
ఎప్పుడూ తనదే పైచేయిగా తాను చేసిందే స్టయిల్‌గా గొప్పలు చెప్పుకునేవాడు. ఇదే ఆ
మిత్రుల్లో ఆగ్రహానికి దారితీసింది. అవేజ్‌ను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్న
వారంతా మీర్‌చౌక్‌లోని పంజేషా ప్రాంతంలో కలుసుకున్నారు. చీకట్లో అందరూ కలిసి
ప్లాన్ చేశారు. ఆ ప్లాన్‌లో భాగమే స్ట్రీట్ ఫైట్. అంతా అనుకున్నట్లు ఏర్పాటు
చేశారు. అవేజ్ ఇద్దరిని ఓడించగా పైచేయి అయింది. దీంతో మరింతగా ఆగ్రహించిన
మిత్రులంతా బలవంతుడుగా ఉండే నబిల్‌ను రంగంలోకి దించారు. స్ట్రీట్ ఫైట్‌లో మొదటగా
నబీల్‌ది పైచేయిగా ఉండటంతో అవేజ్ రెచ్చిపోయాడు. ఇష్టం వచ్చినట్లు పిడిగుద్దులు
గుద్దడంతో నబీల్ అక్కడే ప్రాణాలు వదిలాడు
నబీల్ మృతితో ఖంగుతిని ఒక్కటైన మిత్రులు విభేదాలు పక్కనపెట్టారు. బైక్ నుంచి పడి చనిపోయాడని, మైనర్ బైక్ నడిపినందుకు పేరెంట్స్ ను కూడా పోలీసులు అరెస్టు చేస్తారని నబిల్ కన్నవారిని బెదిరించి గుట్టుచప్పుడు కాకుండా బార్కాస్ స్మశానవాటికలో ఖననం చేశారు.
గుట్టు విప్పిన సెల్ ఫోన్
అంతా అయిపోయిందనుకుని ఎక్కడివారక్కడ ఊపిరి పీల్చుకోగా సెల్‌ఫోన్ తీసిన విజువల్స్ బయటకు రావడంతో నబిల్ హత్య వెలుగు చూసింది. పోలీసులకు సమాచారం అందిన వెంటనే యువకులను అదుపులో తీసుకుని విచారణ చేయగా ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. నబీల్‌ను హత్య చేసిన విషయం నిందితుల్లో కొందరు వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో యువకులు వెల్లడించారు. హత్య జరిగిన విషయం తెలిసిన్పటికీ దాచి ఉండటం నేరమే. దీంతో రహస్యంగా ఉంచిన పేరెంట్స్ పై కేసులు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. మరోపక్క మైనర్లు అర్థరాత్రి దాటిన తరువాత రోడ్లపై కనిపిస్తే వారిని అదుపులో తీసుకోవడంతో పాటు పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చూపుతున్న కారణంలో తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని డిసిపి సత్యనారాయణ హెచ్చరికలు జారీ చేశారు.
స్ట్రీట్ ఫైట్‌లో తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండటంతో జువెనల్ బోర్డు ముందు ప్రవేశపెట్టారు. మిగిలిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు. అరెస్టు అయిన వారిలో మహ్మద్ అవేజ్ పటేల్ అలియాస్ ఓవైసీ పటేల్, మీర్జా ఉమర్ అలీబేగ్ అలియాస్ ఒమర్, వాసిమ్ ఖాన్ అలియాస్ డాలర్, మీర్జా నిషారుల్లా బేగ్ అలియాస్ సుల్తాన్ మీర్జా, మహ్మద్ అబ్దుల్ ఖఫీ అలియాస్ ఒబిద్, మహ్మద్ సులేముద్దీన్ అలియాస్ సులేమాన్, ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ అలియాస్ ఇర్ఫాన్ పఠాన్ లున్నారు.

క్రమశిక్షణ
లోపమే
ఇది
పాతబస్తీలో ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. నబీల్ హత్యా తో అంతా గప్ చుప్ అయినా
అనేక గల్లీల్లో ఇది తరచుగా జరిగే వ్యవహారమే. సంపన్న కుటుంబాలు నిరుపేదలు అనే తేడా
లేకుండా పనీ పాటా లేని యువకులు ఈ వికృత క్రీడలకు పాల్పడుతున్నారు. ఇదంతా నిజంగా
తల్లి దండ్రులకు తెలియకుండానే జరుగుతోందా. నమ్మలేని విషయం ఇది.పిల్లలు జులాయిగా
తిరుగుతున్నా పట్టించుకోని తల్లిదండ్రులదే ఈ నేరం. పిల్లల పెంపకంలో క్రమశిక్షణ
అలవరిస్తే ఇలాంటి దారుణాలు జరుగుతాయా. ఇలాంటి కేసుల్లో తల్లి దంద్రులపై కూడా
కేసులు నమోదు చేస్తేనే కొంతలో కొంతైనా దీనికి అడ్డుకట్ట వేయవచ్చు.
No comments:
Post a Comment